ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్‌ఎంసీకి రూ.5 లక్షల విరాళం

ABN, First Publish Date - 2020-03-30T09:42:34+05:30

ఖైరతాబాద్‌కు చెందిన వ్యాపారి వైల నిరంజన్‌ కరోనా కట్టడి కోసం జీహెచ్‌ఎంసీకి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖైరతాబాద్‌, మా ర్చి 29 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌కు చెందిన వ్యాపారి వైల నిరంజన్‌ కరోనా కట్టడి కోసం  జీహెచ్‌ఎంసీకి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆదివారం ఆయన స్థానిక కార్పొరేటర్‌ విజయారెడ్డితో కలిసి మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు చెక్కును అందజేశారు. వైల నిరంజన్‌ను మేయర్‌ అభినందించారు. చెక్కును జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్యకు అందజేసి సిబ్బందికి అవసరమయ్యే రక్షణ పరికరాలను సమకూర్చాలని ఆదేశించారు.


సీఎం సహాయనిధికి రూ.2 లక్షల విరాళం

జీడిమెట్ల, మార్చి 29 (ఆంధ్రజోతి): కరోనా బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన వైష్ణవి వెంచర్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ శ్రావణ్‌, ఆయన తండ్రి రమణ రూ.2లక్షలు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేకానంద్‌కు చెక్కును శ్రావణ్‌ ఆదివారం అందజేశారు.


లక్ష రూపాయల విరాళం

బర్కత్‌పుర్ల, మార్చి 29 (ఆంధ్రజోతి): సీఎం సహాయనిధికి లక్ష్మీ క్యాటరింగ్‌ అధినేత పసుపులేటి అశోక్‌ లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి చెక్‌ను అందజేసినట్లు ఆయన తెలిపారు.


పేదల కోసం లక్ష రూపాయల విరాళం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడానికి బాలాంజనేయ స్వామి ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ, పారిశ్రామిక వేత్త నాగులూరి సాయిబాబా ఆదివారం రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ను కలిసి లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబాను, పద్మారావుగౌడ్‌ అభినందించారు.

  - బౌద్ధనగర్‌ (ఆంధ్రజ్యోతి) 


Updated Date - 2020-03-30T09:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising