ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

60 నిమిషాల్లో.. 49 మందికి... హైదరాబాద్‌లో కరోనా లెక్కలివీ..!

ABN, First Publish Date - 2020-07-13T14:09:19+05:30

గ్రేటర్ హైదరాబాద్‌లో 60 నిమిషాలకు 49 మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ లెక్కన రోజుకు సగటున 1169 మందికి వైరస్ నిర్ధారణ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రేటర్ లో కరోనా కేసుల నమోదు తీరిదీ..

కళ్లెం పడని కరోనా..

తాజాగా 800 మందికి వైరస్

12 రోజుల్లో 14,033 మందికి కరోనా..


హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లో 60 నిమిషాలకు 49 మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ లెక్కన రోజుకు సగటున 1169 మందికి వైరస్ నిర్ధారణ అవుతోంది.. ఈ నెల మొదటి వారంలో ఉన్న తీవ్రత నాలుగు రోజులుగా లేకపోయినప్పటికీ సగటున వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. గత నాలుగు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో వెయ్యి లోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో 800 మందికి వైరస్ సోకినట్లు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. శనివారం కంటే ఆదివారం 64 కేసులు అదనంగా నమోదయ్యాయి. ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో మినహా 3వ తారీఖు నుంచి 8వ తేదీ వరకు 1270 నుంచి 1660 మధ్య కేసులు నమోదయ్యాయి. 9వ తేదీ నుంచి మాత్రం 800 నుంచి 920 మధ్య మాత్రమే కేసులు ఉన్నాయి. వారం రోజుల పాటు రికార్డు స్థాియలో పెరిగిన కేసులు ఒక్కసారిగా సగానికి సగం తగ్గిపోయాయి. ఈ నెలలో గడచిన 13 రోజుల్లో గ్రేటర్ లో 14,033 మందికి కరోనా వైరస్ సోకింది..



Updated Date - 2020-07-13T14:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising