ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 బీసీ కులాలను జాబితాలో చేర్చాలి

ABN, First Publish Date - 2020-11-20T09:03:17+05:30

జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే బీసీలో చేర్చాలని జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. తొలగించిన కులాలను బీసీ జాబితాలో కలపకపోతే గ్రేటర్‌ ఎన్నికల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, నవంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే బీసీలో చేర్చాలని జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. తొలగించిన కులాలను బీసీ జాబితాలో కలపకపోతే గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సను ఓడిస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో తొలగించిన 26 బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ జేఏసీ నాయకులు ఆళ్ల రామకృష్ణ, పీవీవీ సత్యనారాయణ, గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి. ఆచారి మాట్లాడుతూ.. కులాలను తొలగించాలంటే ఆ కులాల మీద కమిషన్‌ వేయాలని, అలా చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నాయకులు రాంకోటి, నీలా వెంకటేష్‌, బొల్లంగి ప్రసాద్‌, ఎస్‌.వెంకటేశ్వర్‌రావు, ఉదయ్‌, వేణు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T09:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising