ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలోని వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు

ABN, First Publish Date - 2020-04-01T17:18:07+05:30

వలస కార్మికులకు ఆశ్రయం కల్పించి ఆహారం అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం నగరమంతటా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వేలాది కార్మికులకు నిలువ నీడ కల్పించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలస కార్మికుల చేయూత

ఉపాధి కోసం రాష్ట్రానికి 3.5 లక్షల మంది...

ఇతర రాష్ట్రాల నుంచి రాక

అందులో 85 వేలమంది జంట నగరాలలో...

వెల్లడించిన మంత్రి తలసాని 

ఏ ఒక్కరికీ ఆకలి బాధ ఉండరాదని ఆదేశాలు

ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు

అవసరాన్ని బట్టి అన్నపూర్ణ కేంద్రాలు పెంచుతాం : మేయర్‌ 

జవహర్‌నగర్‌లో ప్రకటన

మేడ్చల్‌ జిల్లా 14,411మంది వలస కార్మికులు

వారి కోసం ఆరు పునరావాస కేంద్రాలు : కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): వలస కార్మికులకు ఆశ్రయం కల్పించి ఆహారం అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం నగరమంతటా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వేలాది కార్మికులకు నిలువ నీడ కల్పించి నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేసే కార్యక్రమంలో అధికారులు, నేతలు పాల్గొన్నారు. 


కొవిడ్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి, పేదలకు అండగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం బన్సీలాల్‌పేట్‌లోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బేగంబజార్‌కు చెందిన బంకట్‌ అనే వ్యాపారి సహకారంతో 627 మంది నిరుపేదలకు 20 రోజులు సరిపడా నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చిన వారికి సామగ్రి పంపిణీ చేయాలని అన్నారు. మన రాష్ట్రానికి 3.5లక్షల మంది ఉపాధి కోసం వలస వచ్చారని, అందులో 85వేల మంది జంటనగరాల్లో ఉన్నారని తెలిపారు. వలస వచ్చిన వారు ఆకలితో అలమటించకూడదని సీఎం 12కిలోల బియ్యం, 500 రూపాయల నగదు అందజేయాలని నిర్ణయించారని తెలిపారు.


రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు 1,500 రూపాయలు ప్రకటించారని, రెండు రోజుల్లో 85 కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంతకుమారి, జీహెచ్‌ఎంసీ ఉత్తర మండల కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌, తహసీల్దార్‌ బాలశంకర్‌, కార్పొరేటర్‌ హేమలత, గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌, బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-01T17:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising