ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

ABN, First Publish Date - 2020-11-03T15:37:53+05:30

ఆగాపురా నుంచి బోయిగూడ కమాన్‌ వరకు ఉన్న రోడ్డుపై వీడీసీసీ (వ్యాక్యూమ్‌ డీవాటర్‌ సిమెంట్‌ కాంక్రీట్‌) పనులు జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, వార్డు-2, డిప్యూటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : ఆగాపురా నుంచి బోయిగూడ  కమాన్‌ వరకు ఉన్న రోడ్డుపై వీడీసీసీ (వ్యాక్యూమ్‌ డీవాటర్‌ సిమెంట్‌ కాంక్రీట్‌) పనులు జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, వార్డు-2, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. ఈ నెల 2 (సోమవారం) నుంచి ఈ నెల 21 వరకు (20రోజులు) ఆగాపురా నుంచి బోయిగూడ కమాన్‌ వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు, వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా వెళ్లే ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు.


  • అలస్కా, దారుస్సలాం వైపు నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్‌లు ఎంచుకుని ఆగాపురా క్రాస్‌రోడ్‌, చార్‌ఖందిల్‌, తాబంద కేఫే, బడీమసీద్‌, మల్లేపల్లి క్రాస్‌రోడ్స్‌ నుంచి వెళ్లాలి. 
  • దారుస్సలాం నుంచి పురానాపుల్‌ వైపు వెళ్లే వాహనదారులు ఆగాపురా క్రాస్‌రోడ్‌, ఆగాపురా, గోడేకి ఖబర్‌, జుమ్మేరాత్‌ బజార్‌ టీ జంక్షన్‌, గాంధీ విగ్రహం వైపు పురానాపూల్‌ వెళ్లాలి. 
  • మంగళ్‌హాట్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు ఆర్‌కే బ్రాస్‌బ్యాండ్‌, ఆగాపురా, క్రాస్‌రోడ్స్‌, చార్‌ఖందిల్‌, తాబంద కేఫే, టీ జంక్షన్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లాలి.
  • అలస్కా వైపు నుంచి మెహిదీపట్నం వెళ్లే భారీ వాహనాలు దారుస్సలామ్‌, ఏక్‌మినార్‌ మసీద్‌, యూసుఫైన్‌ దర్గా క్రాస్‌రోడ్స్‌, బజార్‌ఘాట్‌ క్రాస్‌రోడ్స్‌, విజయ్‌నగర్‌కాలనీ, మాసాబ్‌ట్యాంక్‌ల మీదుగా మెహిదీపట్నం వెళ్లాలి. 
  • మెహిదీపట్నం నుంచి ఎంజే మార్కెట్‌, పురానాపుల్‌ వైపు వెళ్లే బస్సులు, భారీ వాహనాలు మల్లేపల్లి క్రాస్‌రోడ్స్‌ నుంచి విజయ్‌నగర్‌ కాలనీ, బజార్‌ఘాట్‌ క్రాస్‌రోడ్స్‌, యూసుఫైన్‌ దర్గా క్రాస్‌రోడ్స్‌, ఏక్‌మినార్‌, తాజ్‌ ఐలాండ్‌, మాలకుంట, ఎంజే బ్రిడ్జి, జుమ్మేరాత్‌ బజార్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

Updated Date - 2020-11-03T15:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising