హైదరాబాద్‌లో దారుణం.. యాచకుడి హత్య
ABN, First Publish Date - 2020-06-01T18:58:39+05:30
పాతబస్తీ చదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో యాచకులు కొట్లాటకు దిగారు. ఫుట్‌పాత్‌లపై నివసున్న ఇద్దరు యాచకుల
హైదరాబాద్: పాతబస్తీ చదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో యాచకులు కొట్లాటకు దిగారు. ఫుట్‌పాత్‌లపై నివసున్న ఇద్దరు యాచకుల మధ్య గొడవ జరిగింది. పిడిగుద్దులు కొట్టడంతో సంఘటనా స్థలంలోనే సర్దార్ అనే యచకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ఖాజాపాషా అలియాస్ పాశును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2020-06-01T18:58:39+05:30 IST