ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌పై అయోమయంలో హైదరాబాద్ ప్రజలు

ABN, First Publish Date - 2020-07-02T17:24:04+05:30

లాక్‌డౌన్‌పై అయోమయంలో హైదరాబాద్ ప్రజలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ వ్యాప్తి బెంబేలెత్తిస్తోంది. సిటీలో పాజిటివ్ కేసుల సంఖ్య 12వేలకు చేరువవుతోంది. క్వారంటైన్‌ కేంద్రాలలో ఏడు వేల మంది బాధితులు ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై సర్కార్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీలో కరోనా కట్టడికి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న 30 ప్రాంతాలను మూసివేయాలని భావిస్తున్న అధికారులు నివేదికను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు గైడ్‌లైన్స్ విడుదలయ్యాయి.


కేంద్రం అన్‌లాక్ 2.0 గైడ్‌లైన్స్‌ను యధావిధిగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో  ఇక హైదరాబాద్‌లో లాక్‌‌డౌన్ ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో కేసులు పెరుగుతున్నా.. మరణాలు సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఆందోళన అవసరంలేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం కూడా ఇప్పట్లో లేనట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సిటీ ప్రజలు అయోమయంలో ఉండిపోయారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సూపర్ మార్కెట్లు, లిక్కర్ షాప్‌లు, ఆర్టీసీ బస్సులు కిటికిటలాడుతున్నాయి. మరోవైపు సిటీలోని 60 శాతం షాపింగ్ ఏరియాలు, దుఖాణాలు ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-02T17:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising