ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవయవాల తరలింపునకు గ్రీన్‌ చానెల్‌.. 13 నిమిషాల్లోనే..

ABN, First Publish Date - 2020-09-21T13:15:11+05:30

హైదరాబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా అవయవాల తరలింపునకు ఆదివారం మరోసారి గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేశారు. కొండాపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా అవయవాల తరలింపునకు ఆదివారం మరోసారి గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేశారు. కొండాపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్‌ వరకు 19.6 కిలోమీటర్ల మేర గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేసి అవయవాల తరలింపునకు సహకరించారు. అవయవాలతో కొండాపూర్‌ కిమ్స్‌ నుంచి 12.50 గంటలకు అంబులెన్స్‌లో బయలుదేరిన వైద్యబృందం, బేగంపేట కిమ్స్‌కు 1.03 గంటలకు చేరుకుంది. గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటుతో 19.6 కిలోమీటర్ల దూరం కేవలం 13 నిమిషాల్లో చేరుకునేందుకు వీలయింది. అవయవాలను సకాలంలో ఆస్పత్రికి చేరుకునేలా సహకరించిన ఇరు కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసులకు వైద్య సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బేగంపేట కిమ్స్‌కు గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేయగా, ఆదివారం ఏర్పాటు చేసిన గ్రీన్‌ చానెల్‌తో ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 10 సార్లు గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేశామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-21T13:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising