ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.13 లక్షల కుటుంబాలు.. రూ. 113 కోట్ల సాయం..

ABN, First Publish Date - 2020-10-25T12:19:42+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంత మునిసిపాలిటీల్లో వరద బాధితుల సహాయార్థం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయం పంపిణీని ముమ్మరం చేశారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంత మునిసిపాలిటీల్లో 1.13 లక్షల కుటుంబాలు వరద బాధితులుగా ప్రభుత్వం అంచనా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంత మునిసిపాలిటీల్లో వరద బాధితుల సహాయార్థం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సహాయం పంపిణీని ముమ్మరం చేశారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంత మునిసిపాలిటీల్లో 1.13 లక్షల కుటుంబాలు వరద బాధితులుగా ప్రభుత్వం అంచనా వేసింది. వారికి ఇవ్వడానికి రూ.113 కోట్లను కేటాయించారు. ఈ పంపిణీని 780 బృందాల ఆధ్వర్యంలో చేపట్టారు. శనివారం సాయంత్రానికే 70 వేల కుటుంబాలకు పంపిణీ జరిగింది. ఆదివారం నాటి కి సంపూర్ణంగా అందజేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసిందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. మొబైల్‌ యాప్‌లను ఉపయోగించి ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి బాధిత కుటుంబాలకు సహాయా న్ని అందజేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదే శం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ కల్టెర్‌ శ్వేతామహంతి తదితరులు ఆర్థిక సహాయం అందించే దిశలో అధికారులు, సిబ్బందిని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. దసరా నేపథ్యంలో పంపిణీని మరింత ముమ్మరం చేశారు. బాఽధితులకు సత్వరమే ఆర్థిక సహాయం అందించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి సోమేశ్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-10-25T12:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising