‘వచ్చే 2 వారాలు అత్యంత కీలకం’
ABN, First Publish Date - 2020-04-05T17:53:26+05:30
‘వచ్చే 2 వారాలు అత్యంత కీలకం’
హైదరాబాద్: కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎస్‌లు, కలెక్టర్లతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే 2 వారాలు అత్యంత కీలకమని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మాసూటికల్ కంపెనీలు పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ఆహారం, మందులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Updated Date - 2020-04-05T17:53:26+05:30 IST