ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ

ABN, First Publish Date - 2020-09-16T23:40:05+05:30

సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందించింది. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై శివబాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందించింది. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై శివబాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఫీజులు పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మౌంట్ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీ ఆదేశించింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా డీఈవోకు హెచ్ఆర్సీ నోటీసులిచ్చింది.


ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేయడంపై మానవ హక్కుల కమిషన్‌ (హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ మణికొండలోని ఓ బడి అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ సినీ నటుడు శివబాలాజీ సోమవారం హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం శివబాలాజీ మీడియాతో మాట్లాడుతూ మౌంట్ లిటేరా జీ స్కూల్‌ బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ‘మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా’ అంటూ శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు. 

Updated Date - 2020-09-16T23:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising