ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదలకు గురైన ప్రాంతాలను సందర్శించిన హోం మంత్రి

ABN, First Publish Date - 2020-10-19T01:21:53+05:30

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ భారీ వర్షాల కారణంగా వరదలకు గురైన ప్రాంతాలను ఆదివారం నాడు సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ భారీ వర్షాల కారణంగా వరదలకు గురైన ప్రాంతాలను ఆదివారం నాడు సందర్శించారు. ఆజంపూర ప్రాంతంలోని జిహెచ్ఎంసి కాలనీ తదితర ఏరియాలలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అన్నారు.


వివిధ శాఖల అధికారులు వర్షాలకు గురైన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన  జాగ్రత్తలు తీసుకుంటుందని స్థానికులకు మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-10-19T01:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising