ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు సాహిత్య అక్షర పురుషుడు రావూరి భరద్వాజ- బండారు దత్తాత్రేయ

ABN, First Publish Date - 2020-07-05T22:54:07+05:30

తెలుగు సాహిత్య అక్షరపురుషుడు రావూరి భరద్వాజ అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలుగు సాహిత్య అక్షరపురుషుడు రావూరి భరద్వాజ అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. ఆయన జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రావూరి భరద్వాజను స్మరించుకోవడ మంటే తెలుగు భాషను గౌరవించుకోవడమేనని అన్నారు. ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ మాతృభాషను మర్చిపోవద్దని, మాతృభాష తెలుగును మర్చిపోతే కన్నతల్లిని మరచిపోయినట్టేనని అన్నారు. భారతీయ భాషలు మన సాంస్కృతిక విలువలు అనేక విధాలుగా విలక్షణ రూపంగా తెలియజేస్తుంటాయన్నారు. అందులో తెలుగు ఒక సమృద్ధ భారతీయ భాష అని, వేరే భారతీయ భాషలకంటే తెలుగు సాహిత్యం జాతీయస్థాయిలో తక్కువ గుర్తింపు పొందిందని, 2012లో రావూరి భరద్వాజ ఎప్పుడైతే అఖిలభారత స్థాయిలో జ్ఞానపీఠ్‌ అవార్డు లభించిన తర్వాతనే తెలుగు భాష మళ్లీ ఒకసారి భారత దేశ తెరపై కనపడిందని అన్నారు.


1970లో కవి సామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణకు జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది. 1988 నుంచి 2012 వరకూ చాలా సుదీర్ఘమైన కాలమని దత్తాత్రేయ పేర్కొన్నారు. రావూరి భరద్వాజ రచనల ద్వారా సామాన్య ప్రజల స్ధితిగతుల మీదనే ఎక్కువ రచనలు చేశారని, 1983లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని, ఒక స్థితప్రజ్ఞ లక్షణాలు వారిలోచూశానని చెప్పారు. జూలై 5 అంటే తెలుగు సాహిత్య లక్షర పురుషుడు రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-07-05T22:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising