ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ABN, First Publish Date - 2020-08-13T17:57:58+05:30

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. సీఎస్‌ సోమేష్‌కుమార్‌ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని  హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించింది. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్‌ సెక్రటరీపై హైకోర్టు సీరియస్‌ అయింది.


ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎస్‌ను ఉద్దేశించి న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటివరకు 50 మందికి నోటిసులు ఇచ్చామని సోమేష్‌కుమార్‌ తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేశామని చెప్పారు. దీంతో మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-08-13T17:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising