ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీజీ మెడికల్‌ ఫీజు పెంపు ఉత్తర్వులు సవరింపు

ABN, First Publish Date - 2020-05-27T07:29:17+05:30

పీజీ మెడికల్‌ కోర్సులకు ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. పెంచిన ఫీజుల్లో ఏ-కేటగిరి ఫీజులో 50ు, బీ-1 కేటగిరి సీట్లకు 60శాతం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏ కేటగిరికి 50 శాతం ఫీజు: హైకోర్టు


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్‌ కోర్సులకు ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. పెంచిన ఫీజుల్లో ఏ-కేటగిరి ఫీజులో 50శాతం, బీ-1 కేటగిరి సీట్లకు 60శాతం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌  నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఆదేశాలిచ్చింది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సుల ఫీజుల పెంపునకు టీఏఎఫ్‌ఆర్సీ సిఫారసుల మేరకు ప్రభుత్వం జీవో జారీచేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఎస్పీ సుదీప్‌ శర్మ మరో 120 మంది వైద్యులు హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. 


జెనీలా కేసులో ఐదుగురు డాక్టర్లపై వేటు!

గద్వాల జిల్లాకు చెందిన జెనీలా అనే బాలింత, నవజాత శిశువు మృతికి సంబంధించిన ఘటనపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు డాక్టర్లను గుర్తించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని డాక్టర్లు ప్రశాంతి, రాధ, కోఠి ప్రసూతి ఆస్పత్రి డాక్టర్‌ అమృత, గాంధీ ఆస్పత్రిలోని డాక్టర్లు మహాలక్ష్మి, షర్మి ల, అపూర్వలను బాధ్యులుగా గుర్తించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోర్టుకు నివేదించారు.


Updated Date - 2020-05-27T07:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising