ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి!

ABN, First Publish Date - 2020-05-13T09:52:11+05:30

లాక్‌డౌన్‌లో పోలీసులు సామాన్య ప్రజల పట్ల వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 12(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో  పోలీసులు సామాన్య ప్రజల పట్ల వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులకు వివరించి చెప్పలేదని వ్యాఖ్యానించింది. వనపర్తి జిల్లాలో బైక్‌పై వెళుతున్న తండ్రి, కొడుకులను ఆపి బాలుడి ముందే తండ్రిపై పోలీసులు చేయిచేసుకున్న ఉదంతాన్ని ఉటంకిస్తూ న్యాయవాది ఉమే్‌షచంద్ర హైకోర్టు సీజేకి రాసిన లేఖను సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ కె. లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు పోలీసులకు తెలియకపోవడంతో వారు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపింది.  

Updated Date - 2020-05-13T09:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising