ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2020-10-11T21:54:33+05:30

తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశించారు. పరిస్థితులను గమనిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారు.


వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో వానలు ముంచెత్తుతున్నాయి. అకస్మాత్తుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఆకస్మికంగా అతి భారీవర్షం కురుస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? అంటే.. దీనికంతటికీ ‘క్యుములోనింబస్‌’ మేఘాలే కారణమంటున్నారు హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు. నిజానికి వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్‌ మేఘా లు వర్షాకాలంలో పూర్తిగా తగ్గిపోవాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ అవి ఆకాశంలో 800-10,000 మీటర్ల ఎత్తులో అక్కడక్కడా ఆవరించే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ వర్ష మేఘాలకు ఈ క్యుములోనింబస్‌ మేఘాలు తోడవుతుండడంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.


Updated Date - 2020-10-11T21:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising