ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

ABN, First Publish Date - 2020-10-17T23:46:27+05:30

నగరంలో మళ్లీ భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో ప్రారంభమైన వాన.. రోడ్లు జలమయం అయ్యేలా భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో మళ్లీ భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో ప్రారంభమైన వాన.. రోడ్లు జలమయం అయ్యేలా భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, ఎల్బీనగర్‌, మీర్‌పేట్‌, హయత్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు నగరంలో వరద కష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి భారీ వర్షం కురవడంతో వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 


తీవ్ర అల్పపీడనం..

అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటలలో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది.ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.


సైదాబాద్‌, చంపాపేట్‌, మలక్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఎల్‌బీ‌నగర్‌- హయత్‌నగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీలు దిగి ఇంటికెళ్లే సమయం కావడంతో ఉద్యోగస్తులు వర్షంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2020-10-17T23:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising