మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిని చంపేశాడు
ABN, First Publish Date - 2020-05-09T10:44:59+05:30
జూదానికి, మద్యానికి బానిసైన ఓ యువకుడు కన్న తల్లిని గొంతు నులిమి చంపిన సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం దుద్యాల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం గడ్డం అంజిలమ్మ(64) ఏకైక
బొంరాస్‌పేట్, మే 8: జూదానికి, మద్యానికి బానిసైన ఓ యువకుడు కన్న తల్లిని గొంతు నులిమి చంపిన సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం దుద్యాల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం గడ్డం అంజిలమ్మ(64) ఏకైక కుమారుడు అశోక్ గత కొంత కాలంగా జూదం, మద్యానికి బానిసయ్యాడు. వారం రోజుల క్రితం వరకు జూదంలో రూ.60 వేల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పటికే తల్లి దగ్గర వెండి అభరణాలు తీసుకువెళ్లి అమ్ముకున్నాడు. ఈ నేపథ్యంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ అశోక్ గురువారం రాత్రి తల్లితో గొడవ పడ్డాడు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు.
Updated Date - 2020-05-09T10:44:59+05:30 IST