ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావి తరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇవ్వాలి: కేటీఆర్‌

ABN, First Publish Date - 2020-06-18T09:37:10+05:30

హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి భావి తరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి భావి తరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత ఉధృతంగా చేపట్టనుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలు మరింత చొరవ తీసుకుని హరిత హారాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు పాటుపడాలన్నారు. హైదరాబాద్‌ శివారులో శంషాబాద్‌ నర్సరీని కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీల్లో పని చేసే వారందరికీ పీఎఫ్‌, ఈఎఫ్‌ వంటి సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా,  హరిత హారంలో భాగంగా ఈ సారి పట్టణ ప్రాంతాల్లో 12.5 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ పేర్కొన్నారు. రానున్న ఆరు నెలల్లో 500 యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ పార్కులు, 700 ట్రీ పార్కులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మునిసిపల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కమిషనర్‌లతో మాట్లాడారు. 

Updated Date - 2020-06-18T09:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising