ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా అయితే పదవులు పోవడం ఖాయం: మంత్రి హరీష్

ABN, First Publish Date - 2020-02-22T20:58:08+05:30

అవినీతి, లంచగొండితనం లేని పాలనను మున్సిపాలిటీల్లో అందించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. పఠాన్‌చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాల పట్టణ ప్రగతి సమ్మేళనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: అవినీతి, లంచగొండితనం లేని పాలనను మున్సిపాలిటీల్లో అందించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. పఠాన్‌చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాల పట్టణ ప్రగతి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీకి పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ల సమక్షంలోనే బడ్జెట్ ప్లానింగ్ రూపకల్పన జరుగుతుందన్నారు. మున్సిపాలిటీల్లో అవినీతి రహిత పాలన అందించాలని సూచించారు. బాధ్యతారాహిత్యంగా ఉంటే పదవులు పోవడం ఖాయం అని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. మున్సిపాలిటీ ఆదాయంలో పది శాతం మొక్కల పెంపకానికే ఖర్చు చేయాలన్నారు. ప్లాస్టిక్ రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-02-22T20:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising