ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాక ఫలితాలపై జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-11-10T18:54:59+05:30

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తమ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం దిశగా దూసుకువెళుతున్నారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 9 రౌండ్లు పూర్తికాగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. దీని బట్టి చూస్తే దేశ నలుమూలల.. దక్షిణాది, ఉత్తరాది, పశ్చిమ పూర్వ, ఉత్తర పూర్వ  ప్రాంతాలన్నింటిలో బీజేపీ హవా నడుస్తోందన్నారు. మోదీ నాయకత్వానికి  దేశ ప్రజలు మరొక్కసారి మద్దతుగా నిలిచారన్నారు. బీజేపీ పెద్దగా బలంగా లేని రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు.


బీహార్‌లో భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్‌గా ఆవిర్భవిస్తోందని జీవీఎల్ అన్నారు. 73 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉందన్నారు. తమను తక్కువ అంచనా వేసేవారు. ఏయే రాష్ట్రాల్లో పెద్దగా ఉనికిలేదని భావించే రాజకీయ పార్టీలు ఒక్కసారి లెక్కలు వేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గొప్ప శక్తిగా ఎదగటానికి ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-11-10T18:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising