ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ మొండిగా వ్యవహరించడం తగదు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-27T15:53:39+05:30

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే మంచి సంప్రదాయం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నూతన వ్యవసాయ  చట్టాల రద్దుపై ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు సఫలం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి  పేర్కొన్నారు. ఎంఎస్పీ ధర విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పప్పు ధాన్యాలను కేంద్రమే కొనుగోలు చేయాలి, ఆయిల్ ఉత్పత్తులపై ప్రోత్సాహకాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రల రైతులకు కొత్త వ్యవసాయ చట్టాలతో పెను నష్టం జరుగుతోందన్నారు. ఎముకలు కొరికే చలిలోనూ నూతన వ్యవసాయ చట్టాలపై  రైతు సంఘాలు పోరాడుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ చట్టసవరణ బిల్లుతో తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండిగా వ్యవహరించడం తగదన్నారు.  దేశంలో 75 శాతం మంది ఉన్న రైతులను ఎడిపించడం బాగా లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.



Updated Date - 2020-12-27T15:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising