ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్‌లో తుపాకుల కలకలం

ABN, First Publish Date - 2020-11-13T19:18:52+05:30

మహబూబాబాద్ నగరంలో తుపాకులు కలకలం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: నగరంలో తుపాకులు కలకలం రేపుతున్నాయి. గన్‌లతో బెదిరింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న కేసముద్రం మండలం, ఉప్పరపల్లిలో కొందరు యువకులు తుపాకులతో వ్యాపారులను బెదిరించిన ఘటన మరువకముందే మహబూబాబాద్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఉండే మహబూబాబాద్‌కు గన్ కల్చర్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.


మహబూబాబాద్‌లోని ఓ వైన్ షాపు వద్ద చిన్న గొడవ జరిగింది. దీంతో దుండగులు గన్‌తో ఓ వ్యక్తిని బెదిరించారు. ఆ గన్‌ను చూసిన ఎదుటి వ్యక్తికి గుండె అగినంతపనైంది. ఇదంతా చూసిన స్థానికులు భయాందోళనలు చెందారు. వారం క్రితం కూడా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, ఉప్పరపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పలువురు వ్యాపారులను తుపాకులతో బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-11-13T19:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising