ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న పాజిటీవ్ కేసులు
ABN, First Publish Date - 2020-06-01T20:08:27+05:30
లాక్ డౌన్ సడలింపులతో ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.
ఖమ్మం జిల్లా: లాక్ డౌన్ సడలింపులతో ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకొక ప్రాంతంలో పాజిటీవ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మధిర, నేలకొండపల్లి ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ప్రారంభంలో మర్కజ్ కాంటాక్ట్ కేసులు 8 పాజిటీవ్ కేసులు రావడంతో వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడ కట్టడి జోన్లను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంది. కాంటాక్ట్ కేసులు పెరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరిన 8 మంది కోలుకున్నారు.
అయితే లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. మధిరకు చెందిన 65 ఏళ్ల వృద్ధిడికి కరోనా రావడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వృద్ధుడి కుమారుడికి పాజిటీవ్ అని తేలడంతో కుటుంబసభ్యులతోపాటు వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ ఖమ్మం క్వారంటైన్‌కు తరలించారు. నేలకొండపల్లికి చెందిన 8 మందికి కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతోపాటు కాంటాక్ట్‌లో ఉన్న 30 మందిని క్వారంటైన్‌కు పంపారు.
Updated Date - 2020-06-01T20:08:27+05:30 IST