సమూహాలు అలానే!
ABN, First Publish Date - 2020-03-27T09:42:29+05:30
నిత్యావసరాల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. సామాజిక దూరాన్ని వీడి.. గుంపులుగా, ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారు. రైౖతు బజార్లు,
కనిపించని సామాజిక దూరం
హైదరాబాద్ సిటీ/ కరీంనగర్ మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నిత్యావసరాల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. సామాజిక దూరాన్ని వీడి.. గుంపులుగా, ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారు. రైౖతు బజార్లు, మార్కెట్లతోపాటు వారాంతపు సంతల్లో ప్రజల రద్దీ అధికంగా ఉంటోంది. అక్కడ సామాజిక దూరం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో సంచార మార్కెట్లు అందుబాటులోకి వస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఓ వైద్యుడు తెలిపారు. అటు జీహెచ్‌ఎంసీ నిర్వహించే అన్నపూర్ణ కేంద్రాల వద్ద ఉచితంగా భోజనం అందిచే ప్రక్రియ గురువారం మొదలైంది. ఊళ్లకు వెళ్లలేని, ఇక్కడ భోజన సదుపాయంలేని వారికోసం ఈ ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల సామాజిక దూరం పాటించే ఏర్పాట్లు చేయకపోవడంతో జనం గూమి గూడారు.
కరీంనగర్‌లోనూ ఇదే పరిస్థితి
కరీంనగర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సామాజిక దూరాన్ని పాటించకుండా ప్రజలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఉదయం నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునేందుకు ఇచ్చిన 3గంటల సడలింపు సమయంలో ప్రజలు గుంపులుగా మార్కెట్‌కు వెళ్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో కర్ఫ్యూ విధించినా ఫలితం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఉదయం మార్కెట్ ప్రాంతాలు, కొన్ని వీధుల్లో పర్యటించి సామాజిక దూరం పాటించక పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కరీంనగర్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్ళకే పరిమితం కావాలని అన్నారు.
Updated Date - 2020-03-27T09:42:29+05:30 IST