ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె పులకరించేలా ప్రకృతి వనాలు

ABN, First Publish Date - 2020-07-07T07:05:03+05:30

పల్లె అంటేనే ప్రకృతికి నిలయం. ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు అనంతం. ఆ ప్రకృతికి, సహజత్వానికి మరింత శోభనిచ్చేలా పల్లెల్లో ప్రకృతి వనాల/గ్రామీణ సహజ వనాల (పార్కులు) నిర్మాణం జరగబోతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పూలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే భారీ వృక్షాలు
  • గ్రామ పంచాయతీల్లోనూ పార్కుల నిర్మాణం
  • హరితహారంలో ‘ఉపాధి’ నిధుల వినియోగం


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పల్లె అంటేనే ప్రకృతికి నిలయం. ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు అనంతం. ఆ ప్రకృతికి, సహజత్వానికి మరింత శోభనిచ్చేలా పల్లెల్లో ప్రకృతి వనాల/గ్రామీణ సహజ వనాల (పార్కులు) నిర్మాణం జరగబోతోంది. పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్కులు పల్లెల్లోనూ కనువిందు చేయనున్నాయి. ఈ వనాల్లో ఆహ్లాదాన్ని నింపేలా, సేద తీరేలా.. అన్ని రకాల పూలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే భారీ వృక్షాలు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే వృక్షాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను సేకరించనున్నారు. హరితహారంలో భాగంగానే ఈ ప్రకృతి వనాలను తీర్చిదిద్దనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఇందుకోసం వినియోగించనున్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను తీర్చిదిద్దనున్నారు. గ్రామాల్లో వేర్వేరు ప్రదేశాల్లో స్థలం అందుబాటులో ఉంటే చిన్న చిన్న వనాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒకటైనా ప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి వీలుగా భూమిని అభివృద్ధి చేయాలని గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఆదేశించింది. 


మూడు వరుసలలో మొక్కలు 

పార్కుల్లో కనీసం 3 వరుసలలో మొక్కలు నాటాలి. హద్దు వెంట ఎత్తుగా పెరిగే చెట్లు ఉండాలి. లోపలి భాగంలో ఎత్తుగా పెరిగే చెట్లు, ఇంకా లోపలి భాగంలో చిన్నగా పెరిగే చెట్లను పెంచాలి. వేప, రావి, మర్రి, కానుగ, బాదం వంటి భారీ వృక్షాలను హద్దు ప్రదేశంలో పెంచాలి. గన్నేరు, మందార తదితర చెట్లను లోపల పెంచాలి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలు, నిత్యావసర మొక్కలైన ఉసిరి, నేరేడు, సీమ చింత, కరివేపాకు, జామ ఇలా అన్ని రకాలను నాటాలి.

Updated Date - 2020-07-07T07:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising