ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పునర్విభజన’ తర్వాతే పోరు

ABN, First Publish Date - 2020-12-30T05:51:59+05:30

పుర పోరుకు వరంగల్‌ మహానగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. ఆ లోగా డివిజన్ల పునర్విభజనపై దృష్టి సారించనుంది. కొద్ది కాలంగా పునర్విభజన ఉంటుందా లేదా అనే డైలమా నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నిర్వహణపై కదలిక
58 నుంచి 66కు పెరగనున్న డివిజన్లు
మారనున్న రిజర్వేషన్లు.. సిట్టింగ్‌లలో కలవరం


వరంగల్‌ సిటీ, డిసెంబరు 29:  పుర పోరుకు వరంగల్‌ మహానగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. ఆ లోగా డివిజన్ల పునర్విభజనపై దృష్టి సారించనుంది. కొద్ది కాలంగా పునర్విభజన ఉంటుందా లేదా అనే డైలమా నెలకొంది. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పునర్విభజన ఉంటుందనే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వారం క్రితం హైదరాబాద్‌లో జిల్లా ప్రజాప్రతినిఽధులు, అధికారులతో మంత్రి కేటీఆర్‌ జరిపిన సమావేశం పునర్విభజన ఖాయమని తేల్చింది. ఈ నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారగణం పునర్విభజనపై దృష్టి పెట్టారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ల పునర్విభజన, జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పురపాలక శాఖకు లేఖ రాసిందనే సంకేతాల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు అలర్ట్‌ అవుతున్నారు. ఏ క్షణంలోనైనా ఆదేశాలు రావచ్చంటున్నారు.  డివిజన్ల పునర్విభజనపై జీడబ్ల్యూఎంసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారిక ఆదేశాలు అంద లేదంటున్నారు. విభజన జరగడం ఖాయమనే బలమైన అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక శాఖకు లేఖ రాయడం.. ప్రభుత్వం స్పందించడం.. ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ జరిగిన క్రమంలో ఆ క్షణం నుంచే తమకు పునర్విభజన పని ప్రారంభం అవుతుందంటున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత
డీలిమిటేషన్‌ ప్రక్రియలో ప్రధానంగా జీడబ్ల్యూఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పాత్ర కీలకం. ఆ తరువాత రెవెన్యూ వింగ్‌. ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లో అధికారులు, కింది స్థాయి సిబ్బంది కొరత నెలకొంది. ఈ సమస్య ఉన్నతాధికారులను వేధిస్తోంది. రేపో, మాపో డీలిమిటేషన్‌కు ఆదేశాలు వెలువడితే ఏమాత్రం జాప్యం చేయకుండా కార్యక్షేత్రంలోకి అధికారగణం పరుగులు పెట్టాలి. నిర్దేశిత గడువులోగా విభజన తంతు ముగించాలి. ముసాయిదా ప్రకటించాలి. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలి. ఏమైనా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటే ఆ మేరకు పనులు చేపట్టాలి. ఈ క్రమంలో  అవసరమైన సిబ్బంది లేకుండా విభజన జరగాలంటే భారం కానుందనే ఆవేదన జీడబ్ల్యూఎంసీ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.

58 నుంచి 66కు...
ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ పరిధిలో 58 డివిజన్లు ఉన్నాయి. 2019 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఖ్యను 66కు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. డివిజన్ల పునర్విభజన ద్వారా వరంగల్‌ మహానగర పాలక సఠింస్థ పరిధిలో మరో 8 కొత్త డివిజన్లు వెలుస్తాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని కార్పొరేషన్లలో 2019 ఆర్డినెన్స్‌ మేరకు డివిజన్ల పునర్విభజన జరిగింది. ఫలితంగా పది కొత్త డివిజన్లు ఏర్పడ్డాయి. రెండు కార్పొరేషన్లలో డివిజన్లు పెరిగి 60కి చేరాయి. ఈ మేరకే జనవరిలో ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది.

మారనున్న రిజర్వేషన్లు...
డివిజన్ల పునర్విభజన ప్రక్రియ రిజర్వేషన్లను మార్చనుంది. ప్రస్తుత డివిజన్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక పునర్విభజనతో డివిజన్ల సంఖ్య 66కు పెరగడంతో మహిళలకు 50 శాతం కేటాయింపు ద్వారా 33 డివిజన్లు వారికి దక్కనున్నాయి. డివిజన్ల పునర్విభజన ఖాయమనే బలమైన సంకేతాల నేపథ్యంలో సిట్టింగ్‌ కార్పొరేటర్లలో కలవరం నెలకొంది. నెల రోజుల క్రితం వరకు డీలిమిటేషన్‌ జరగదనే నమ్మకంతోనే కార్పొరేటర్లు ఉన్నారు. సీన్‌ మారడంతో తమ సీటు మారనుందనే బెంగలో పడ్డారు. మార్పు జరిగితే భార్య లేదా భర్త దస్తీ వేస్తారనే అంచనాలు నెలకొన్నాయి.

విభజన ముగిశాకే..
డివిజన్ల పునర్విభజన తంతు ముగిశాక జీడబ్ల్యూఎంసీ ఎన్నికలపై స్పష్టత రానుంది. ప్రస్తుత పాలకవర్గ గడువు మార్చి 15 వరకు ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం డీలిమిటేషన్‌తో పాటు గడువులోపే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసినా.... ఎన్నికల విషయంలో ప్రభుత్వ నిర్ణయమే ఉంటుందని నిపుణులు అంటున్నారు. గడువు లోపు ఎన్నికలు జరగని పక్షంలో స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన కొనసాగుతుంది.

మార్చి 15 తదుపరే ఎన్నికలు...?
జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం గడువు మార్చి 15తో ముగుస్తుంది. ఈ లోగానే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో డిఫెన్స్‌లో పడింది. ఎన్నికలు మాట పక్కన పెట్టి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంకల్పించారు. మార్చి 1 నుంచి నగరంలో ప్రతీరోజు తాగునీటి సరఫరా. ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే గులాబీ దళం ఉంది. ఈ క్రమంలో ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. వస్తే కోడ్‌ అమల్లోకి వస్తుంది. అభివృద్ధి హంగామా ఉండదు. ఇక మధ్య, ముగింపు దశకు చేరిన వివిధ అభివృద్ధి పనుల పూర్తి. నిధుల విడుదల. డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల అంకం ముగియాలంటే ఇంకా ఆరు నెలలైనా పడుతుందనే అంచనాలు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉన్నాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తే మార్చిలో  కాదు జూన్‌లో ఎన్నికలు నిర్వహించ వచ్చని భావిస్తున్నారు.

Updated Date - 2020-12-30T05:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising