సింగరేణి డైరెక్టర్ బలరామ్‌కు ‘‘గ్రామోదయ బంధుమిత్ర’’ అవార్డు
ABN, First Publish Date - 2020-10-05T00:32:24+05:30
సింగరేణి డైరెక్టర్ బలరామ్‌కు ‘‘గ్రామోదయ బంధుమిత్ర’’ అవార్డు
హైదరాబాద్: ఐ.ఆర్.ఎస్ అధికారి, సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్. బలరామ్‌కు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘‘గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ’ ‘‘గ్రామోదయ బంధుమిత్ర అవార్డు’’ను బహుకరించి శాలువాతో ఘనంగా సన్మానించింది. గ్రామీణ అభివృద్ధి, పర్యావరణహిత చర్యలకు గుర్తింపునకు బలరామ్‌కు అవార్డు అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ప్రేరేపితులై ఇతరులతో మొక్కలు నాటించడమే కాదు, తాను కూడా స్వయంగా మొక్కలు నాటాలని ఎన్.బలరామ్ సంకల్పించారు. ప్రతి మనిషి 3 మొక్కలు నాటి వాటిని పెంచాలి. అప్పుడే ప్రతీ మనిషికి కావాల్సి ఉన్న 280 కిలో ఆక్సిజన్ లభ్యమవుతుందని బలరామ్ అన్నారు.
స్వయంగా పలుగు పార పట్టి 8 వేల మొక్కలు నాటడం అంటే అది సామాన్య విషయం కాదు. డైరెక్టర్ హోదాలో ఐ.ఆర్.ఎస్. అధికారి ఇటువంటి స్ఫూర్తిదాయకమైన, క్లిష్టతరమైన పనిని సమర్థంగా నిర్వహించారు. మరో 2 వేల మొక్కలు కూడా స్వయంగా నాటి 10 వేల మొక్కలు నాటడం ద్వారా యువతకు, అధికారులకు స్ఫూర్తిగా నిలవాలనుకోవడం ఎంతైనా అభినందనీయం. సింగరేణి భవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ‘‘గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ’’ (జీకాట్) సంస్థ వ్యవస్థాపకులు ఢిల్లీ వసంత కుమార్, సంస్థ సీఈవో శ్రవణ్ కుమార్ మడం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కామేశ్వర రాజు పాల్గొన్నారు.
జీకాట్ సంస్థ ద్వారా సన్మానం అందుకొన్న ప్రముఖుల్లో ‘‘గ్రీన్ ఛాలెంజ్’’ ప్రారంభకులు ఎంపీ సంతోష్ కుమార్, కరోనా సమయం నుంచి ఇప్పటి వరకూ పేదలకు ఇతోధికంగా సహాయం చేస్తున్న శ్రీ సోనూసూద్, నాబార్డ్ ఛైర్మన్ శ్రీ గోవిందరాజు, వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్‌ర్ ప్రవీణ్ రావు వంటి ప్రముఖ నిస్వార్ధ సేవలకున్నారు. 150వ మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 150 మంది ప్రముఖులను జీకాట్ సంస్థ సన్మానించడం గమనార్హం. వీరిలో ఎన్.బలరామ్ కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ శ్రీ తమళిసై సౌందర్ రాజన్‌తో పాటు తదితర ప్రముఖు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Updated Date - 2020-10-05T00:32:24+05:30 IST