ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతన సంఘం, ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు... టీఈఏ అధ్యక్షుడు సంపత్ కుమారస్వామి

ABN, First Publish Date - 2020-12-30T03:37:44+05:30

వేతన సవరణకే నియమితమైన వేతన సంవరణ కమిషన్... రెండున్నర సంవత్సరాలు పూర్తైన తర్వాత కూడా ఇంతవరకు నివేదిక సమర్పించకపోవడం విచారకరమని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీఈఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి ధ్వజమెత్తారు. అంతేకాకుండా... ఇప్పటివరకు నివేదించకపోవడం ఒక వైఫల్యం కాగా, అధ్యయనం చేయడానికి మళ్ళీ కమిటీ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హైదరాబాద్ : వేతన సవరణకే నియమితమైన వేతన సంవరణ కమిషన్... రెండున్నర సంవత్సరాలు పూర్తైన తర్వాత కూడా ఇంతవరకు నివేదిక సమర్పించకపోవడం విచారకరమని  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీఈఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  చిలగాని సంపత్ కుమార స్వామి ధ్వజమెత్తారు. అంతేకాకుండా... ఇప్పటివరకు నివేదించకపోవడం ఒక వైఫల్యం కాగా, అధ్యయనం చేయడానికి మళ్ళీ కమిటీ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 


ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీవిరమణ వయోపరిమితిని 61 సంవత్సరాలుగా చేస్తామని కిందటి ఎన్నికలకు ముందు నిర్దిష్టంగా చెబుతూ వచ్చిన టీఆర్‌ఎస్ నేతలు.... ఇప్పుడు మాత్రం మాట దాటవేసేలా, కమిటీల పేరుతో కాలాయాపన చేస్తూండడం సరికాదని సంపత్‌కుమార స్వామి ధ్వజమెత్తారు. 



ఇక... నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోడ్ కూడా త్వరలో రానున్న నేపధ్యంలో... తక్షణమే 65 శాతంఫిట్‌మెంట్ తో పీఆర్సీని ప్రకటించాలని, అంతేకాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయోపరిమితిని 61 సంవత్సరాలకు బేషరతుగా పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయడానికి కూడా తక్షనమే తగిన చర్యలకు శ్రీకారం చుట్టాలని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-30T03:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising