ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలు మరణ వార్త హృదయాన్నికలిచి వేసింది- గవర్నర్‌

ABN, First Publish Date - 2020-09-25T21:04:17+05:30

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి వార్త తన హృదయాన్ని కలిచి వేసిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి వార్త తన హృదయాన్ని కలిచి వేసిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆయన మృతి చెందారని తెలిసి తీవ్ర షాక్‌కు గురైనట్టు తెలిపారు. గాయకుడిగా, సంగీతకర్తగా, నటుడిగా ఆయన ఎంతో ప్రతిభను కనబర్చారని పేర్కొన్నారు. లక్షలాది మంది సంగీత ప్రియులను ఎస్పీబాలు గానంతో అలరించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారని తెలిపారు. దశాబ్ధాలుగా సంగీత ప్రపంచానికి ఆయన సేవలు అందించారని అన్నారు. దాదాపు 40వేల పాటలను వివిధ భాషల్లోపాడి ప్రజల్ని అలరించారని తెలిపారు.


ప్రజల గుండెల్లో బాలు, ఆయన పాటు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి జాతికి ముఖ్యంగా సంగీత ప్రపంచానికి తీరని లోటని గవర్నర్‌పేర్కొన్నారు. ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై బాలు కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు.

Updated Date - 2020-09-25T21:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising