ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ పాలనతో స్వర్ణయుగం

ABN, First Publish Date - 2020-07-01T11:40:11+05:30

అన్నదాత బతుకు చిత్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ పాలనతో తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య


లింగాలఘణపురం జూన్‌ 30 : అన్నదాత బతుకు చిత్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ పాలనతో తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం సిరిపురం, లింగాలఘణపురం, వనపర్తిలో రైతువేదికల నిర్మాణాలకు భూమిపూజతో పాటుగా వడ్డిచర్లలో జరిగిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం 24 గంటల్లో 50 లక్షలమంది రైతుల ఖాతాలకు రూ.5వేల కోట్ల రైతుబంధు నిధులను జమచేసిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు.


కేసీఆర్‌ పాలనాదక్షతను ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయన్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ రైతును రాజుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ రమణారెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, రైతబంధు మండల కోఆర్డినేటర్‌ బస్వగాని శ్రీనివాస్‌, సర్పంచ్‌లు లక్ష్మి, విజయ, శ్రీధర్‌, కృష్ణ, ఎంపీటీసీలు మాధవి, బిక్షపతి, మంగమ్మ, రాజు, నాయకులు సేవెల్లి సంపత్‌, నాగేందర్‌, ఉపేందర్‌రెడ్డి, గండి యాదగిరి, ఊడ్గుల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


ఎవరికీ మినహాయింపులు లేవు..

స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌ : స్టేషన్‌ ఘన్‌పూర్‌ గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు 33 ఫీట్లతో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు వెడల్పులో ఎవరికీ మినహాయింపులు లేవని ఎమ్మెల్యే  రాజయ్య స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు కొందరు రోడ్డు వెడల్పులో తవ్వకాలు చేయలేదని వచ్చిన ఆరోపణలపై మంగళవారం ఎమ్మెల్యే ఓ ప్రకటన విడుదల చేశారు. రోడ్డు వెడల్పునకు అందరూ సహకరించాలని కోరారు.

Updated Date - 2020-07-01T11:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising