ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25 నుంచి గోల్కొండ బోనాలు

ABN, First Publish Date - 2020-06-18T12:29:54+05:30

25 నుంచి గోల్కొండ బోనాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ నిబంధనల మేరకే ఉత్సవాలు..

కొండపైకి భక్తులకు అనుమతిపై సందిగ్ధం   

నార్సింగ్‌(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంప్రదాయ బోనాల ఉత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా చారిత్రక గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు జరగనున్నాయి. ఇందుకోసం దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. 25న కోటపై అమ్మవారి ఆలయంలో మొదటి పూజ నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రతీ ఆదివారం, గురువారం ఆలయంలో ఉత్సవాలు జరుపుతుంటారు.   

 

  మొదటి రోజు పూజ కోసం లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు, చిన్న బజారు నుంచి అమ్మవారి ఊరేగింపు ఉం టుంది. ఇందులో దేవాదాయ ఉద్యోగులు, ఆల య పూజారులు మాత్రమే పాల్గొంటారు.  కొండపైకి భక్తుల అనుమతిపై ఇంకా నిర్ణయించలేదు. జూన్‌ 25న (గురువారం) మొదటి పూజ, 28న (ఆదివారం) రెండవ పూజ, జూలై 2న మూడో పూజ, 5న (ఆదివారం) నాల్గవ పూజ, 9న ఐదో పూజ, 12న ఆరవ పూజ, 16న 7వ పూజ, 19న 8వ పూజ, జూలై 23న గురువారం 9వ పూజ నిర్వహిస్తారు. 

Updated Date - 2020-06-18T12:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising