ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలి: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-08-16T22:00:50+05:30

ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. టికెట్లు ఇవ్వలేని వారికి పార్టీలో పదవులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. టికెట్లు ఇవ్వలేని వారికి పార్టీలో పదవులు ఇస్తామని ఒప్పించి బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం 2006 ముందున్న మ్యాప్‌లను రద్దుచేసిందని తెలిపారు. సచివాలయం క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉందని, ఇప్పుడున్న చట్టాల ప్రకారమే అక్కడ అనుమతులు ఇవ్వాలన్నారు. తెలంగాణకు సచివాలయం లేదని, ఏపీకి రాజధాని లేదని రేవంత్ తప్పుబట్టారు. 


పాతబస్తీలో 14వేల ఓట్లకు ఒక డివిజన్ ఉందన్నారు. అయితే కూకట్‌పల్లి వంటి చోట్ల లక్షకుపైగా ఓట్లకు ఒక డివిజన్ ఉందని తెలిపారు. ఎంఐఎంకు అనుకూలంగా ఉన్నచోట్ల తక్కువ ఓట్లు ఉండేలా చూసారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పరస్పర ఒప్పందంతో డివిజన్ల వర్గీకరణ చేశారని విమర్శించారు. దీని పై న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని  ఆయన సూచించారు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల హామీపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, ప్రతిరోజు ఉదయం నాయకులు బస్తీలలో తిరగాలని రేవంత్‌రెడ్డి సూచించారు.

Updated Date - 2020-08-16T22:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising