ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టుల్లో ఉద్యోగాలంటూ ఘరానా మోసం

ABN, First Publish Date - 2020-11-13T09:08:21+05:30

న్యాయస్థానాల్లో ఉద్యోగాల పేరుతో అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడింది ఓ ముఠా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట్ల రూపాయలు వసూలు చేసిన వైనం

ఉన్నతాధికారి సంతకం ఫోర్జరీ

నకిలీ నోటిఫికేషన్‌ సైతం జారీ  

ఉద్యోగాలకు ఎంపికైన జాబితా తయారీ

గాంధీలో 150 మందికి వైద్య పరీక్షలు

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాల్లో ఉద్యోగాల పేరుతో అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడింది ఓ ముఠా. ఓ ఉన్నతాధికారి సంతకం పోర్జరీ చేసి అసలుకు ఏ మాత్రం తీసిపోకుండా నిందితులు నకిలీ నోటిఫికేషన్‌ సైతం విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి అందినకాడికి దండుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో అమాయకులు మోసపోయారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం, ఉన్నతాధికారి సంతకం పోర్జరీ కేసు కావడంతో పోలీసులు అత్యంత గోప్యంగా దర్యాప్తు జరుపుతున్నారు.


విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయస్థానాల్లో కిందిస్థాయిలో పోస్టుల భర్తీకి ఓ ముఠా పథకం ప్రకారం కొన్ని నెలల క్రితం నకిలీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. చాలా మంది యువతి, యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల్లో ఉన్న ఫోన్‌ నంబర్లు, వివరాల ఆధారంగా వారితో బేరసారాలు జరిపి ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి నిందితులు సుమారు రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే ఎంపికైన వారి జాబితాను కూడా ప్రకటించారు.


ఎంపికైన వారిలో చాలా మంది విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలన పేరుతో తీసుకున్నారు. అభ్యర్థులకు మరింత నమ్మకం కలిగించేందుకు ఏకంగా గాంధీ ఆస్పత్రిలో సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం కూడా నిందితులు ఓ ఉన్నతాధికారి సంతకాన్ని పోర్జరీ చేశారు.


చివరకు, ఓ నిందితుడిని కలిసి  ఓ యువకుడు ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చాడన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆ బాధితుడి ద్వారా తీగ లాగితే డొంకంతా కదిలింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంగా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు గుర్తించిన పోలీసులు అక్కడ ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు ఇచ్చిన సమాచారం మేరకు వరంగల్‌లో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు పరారీ కావడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.




ప్రముఖుల ప్రమేయం?

పక్కా పథకం ప్రకారం జరిగిన ఈ వ్యవహారంలో ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడ్డ నిందితులు కొందరి ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు తెలిసింది.

వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


Updated Date - 2020-11-13T09:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising