ప్రైవేటుకు గౌతమి, గోదావరి రైళ్లు!
ABN, First Publish Date - 2020-12-15T08:17:34+05:30
విజయవాడ రైల్వే డివిజన్లో భారీ డిమాండ్ ఉన్న గోదావరి, గౌతమి సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రైల్వేబోర్డు ఆదేశాల
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
విజయవాడ రైల్వే డివిజన్లో భారీ డిమాండ్ ఉన్న గోదావరి, గౌతమి సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రైల్వేబోర్డు ఆదేశాల మేరకు డివిజన్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటుకు అప్పగించే ప్రయతాల్లో భాగంగా గోదావరి, గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని కోచ్‌లన్నంటినీ ఏసీగా మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇదే జరిగితే.. ఇకపై వీటిలో జనరల్, స్లీపర్ కోచ్‌లు ఉండవు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ తర్వాత మిగిలిన కోచ్‌లన్నీ ఽథర్డ్ ఏసీగానే ఉంటాయి. దీంతో పేద వర్గాలకు ఈ రైళ్లు దూరంకానుండగా, మధ్యతరగతి వర్గాలకు ప్రయాణం భారంగా మారనుంది. ఇటీవల బిడ్డర్లతో నిర్వహించిన సమావేశంలో జరిగిన రహస్య ఒప్పందాల్లో ఈ రైళ్ల ప్రతిపాదనా ఉన్నట్టు తెలుస్తోంది.
Updated Date - 2020-12-15T08:17:34+05:30 IST