ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి వేతనాలు

ABN, First Publish Date - 2020-07-07T07:22:02+05:30

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. జూన్‌ నెల వేతనాల్లో కోత లేకుండా పూర్తిగా ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించడంతో ఆర్టీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రికవరీ డేటా ఇచ్చేది లేదన్న సీసీఎస్‌
  • మార్చి వివరాల ప్రకారమే జీతాల చెల్లింపు


హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. జూన్‌ నెల వేతనాల్లో కోత లేకుండా పూర్తిగా ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించడంతో ఆర్టీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసింది. జీతాలను నేడో రేపో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. సంస్థలోని 49,733 మంది సిబ్బందికి నెలకు వేతనాల బిల్లు రూ.120కోట్ల వరకూ ఉంటోంది. బస్సులు ఎక్కువగా నడవకపోవడం, ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో ఆంధ్రాబ్యాంకు నుంచి ఆర్టీసీ తీసుకున్న రూ.600కోట్ల రుణం నుంచే వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. జూన్‌ నెల వేతనాలను కూడా అందులోంచే సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది. కాగా, ఉద్యోగులు తీసుకున్న రుణాల నిమిత్తం మినహాయించాల్సిన సొమ్ము, సభ్యత్వ రుసుం వివరాలను ప్రతి నెలా ఆర్టీసీకి ఉద్యోగుల క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ(సీసీఎస్‌) అందజేస్తుంది. దాని ప్రకారం మినహాయించి ఉద్యోగులకు ఆర్టీసీ వేతనాలు చెల్లిస్తుంది. ఈ మేరకు వివరాలు ఇవ్వాలంటూ సీసీఎ్‌సను ఆర్టీసీ కోరింది. అయితే, ఆ వివరాలు ఇవ్వడానికి సీసీఎస్‌ పాలకవర్గం నిరాకరించింది. దాంతో ఈడీలు జోక్యం చేసుకుని సీసీఎస్‌ సెక్రటరీని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వద్దకు పిలిపించారు. పాలకవర్గం తీసుకున్న నిర్ణయం కాబట్టి వివరాలు ఇవ్వలేమంటూ సెక్రటరీ కూడా తేల్చి చెప్పడంతో.. మార్చి నెల సీసీఎస్‌ వివరాల ఆధారంగానే జూన్‌ వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు సమాచారం.

Updated Date - 2020-07-07T07:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising