ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనగామలో ఫుల్లు వానలు

ABN, First Publish Date - 2020-08-22T10:16:38+05:30

జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురియగా శుక్రవారం వర్షాల పరంపర కొనసాగింది. జనగామ జిల్లాలో 37.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిండుకుండలా చెరువులు, కుంటలు

పొంచివున్న ప్రమాదాలు

500 చెరువులకు పూర్తిస్థాయి నీటిమట్టం, మత్తళ్లు


జనగామ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : 

జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురియగా శుక్రవారం వర్షాల పరంపర కొనసాగింది. జనగామ జిల్లాలో 37.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, చెరువులు, కుంటలు నిండుకుండలా మారగా, పొంచివున్న గండి, ప్రమాదాలు, ఆయకట్టు రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. మొత్తం 12 మండలాల పరిధిలో 943 చెరువులు, కుంటలుండగా, ఇందులో 500 నిండాయి. 8 రిజర్వాయర్లలో చీటకోడూరు, అశ్వరావుపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌ పూర్తిస్థాయిలో నీటి మట్టానికి చేరాయి. 250 వరకు చెరువులు, కుంటలు మత్తళ్లు పరవళ్లు తొక్కుతుండటంతో వాగులు పొంగుతున్నాయి. జనగామ మండలం యేనచెరువు, యానం చెరువు, పెరుమాళ్ల చెరువు కట్టలు మత్తళ్లు పోస్తుండడంతో బలహీనంగా ఉన్నాయి. దాదాపు 2 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన కుందారం చెరువు మత్తడి పరవళ్లు తొక్కుతుండడంతో కట్టపరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. పాలకుర్తి, రఘునాథపల్లి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో చెరువులు, కుంటల్లో ప్రమాదకరస్థాయిలో నీటిమట్టం పెరుగుతోంది. పట్టణంలోని రంగప్పచెరువు మత్తడితో లోతట్టు ప్రాంతాలకు వరద ప్రమాదం పొంచివుంది. కలెక్టర్‌ కె.నిఖిల శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా చెరువులు, కుంటల పరిస్థితి, జాగ్రత్తలపై అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు 650 పాత ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-22T10:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising