నగరాలకు ‘పండ్లు’.. రైతుల కోసం ‘ఫాం టు హోం’
ABN, First Publish Date - 2020-04-12T08:53:46+05:30
పండ్ల రైతులకు మార్కెటింగ్ ఊరట కల్పించేందుకు ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ ముందుకొచ్చింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల నుంచి తాజా పండ్లు సేకరించి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సరఫరా చేసేందుకు ‘ఫాం టు
పండ్ల రైతులకు మార్కెటింగ్ ఊరట కల్పించేందుకు ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ ముందుకొచ్చింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల నుంచి తాజా పండ్లు సేకరించి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సరఫరా చేసేందుకు ‘ఫాం టు హోం’ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జలవనరుల అభివృద్థి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్ శనివారం ప్రారంభించారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీ సంఘాలకు ఉచితంగా డెలివరీ చేస్తామని సంస్థ ప్రతినిధి కరుణాకర్ రెడ్డి తెలిపారు. 98494 33311 నంబర్‌కు ఫోన్ చేయొచ్చన్నారు.
Updated Date - 2020-04-12T08:53:46+05:30 IST