ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం

ABN, First Publish Date - 2020-03-27T10:55:43+05:30

లాక్‌డౌన్‌ వేళ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ ఉదార నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాల వద్ద గురువారం ఉచితంగా భోజనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వేళ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ ఉదార నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాల వద్ద గురువారం ఉచితంగా భోజనం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణంగా రూ.5కు అందిచే భోజనాన్ని లాక్‌డౌన్‌ దృష్ట్యా ఉచితంగా అందజేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణ ఇబ్బందులున్నాయంటూ హాస్టళ్లు ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేసిన నేపథ్యంలో బుధవారం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన కేటీఆర్‌.. హాస్టళ్లలో ఉండే వారికీ జీహెచ్‌ఎంసీ నుంచి ఉచితంగా భోజనం అందజేయాలని సూచించారు. మొదటి రోజు 10 వేల మందికి భోజనం అందజేశామని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. 

Updated Date - 2020-03-27T10:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising