ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాప్తి నివారణకు శానిటైజర్లను పంపిణీ చేసిన టీఆర్‌ఎస్‌ నేత

ABN, First Publish Date - 2020-03-29T21:18:58+05:30

ప్రపంచ దేశాలకు పెనుసవాల్‌గా మారిన కరోనావైరస్‌ను వ్యక్తిగత జాగ్రత్తలతోనే నియంత్రించడం సాధ్యమని సికింద్రాబాద్‌పార్లమెంట్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలకు పెనుసవాల్‌గా మారిన కరోనావైరస్‌ను వ్యక్తిగత జాగ్రత్తలతోనే నియంత్రించడం సాధ్యమని సికింద్రాబాద్‌పార్లమెంట్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌ అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసి పరిదిలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు యువనేత నగరంలోని పలు ప్రాంతాల్లోశానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌తో కలిసి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వీటిని స్థానిక ప్రజలకు అందజేసి అవగాహన కల్పించారు. ఆదే విధంగా ఖైరతాబాద్‌ నియోజక వర్గం పరిధిలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్యం కార్మికులు, ప్రజలకు శానిటైజర్లను పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఉచితంగా శానిటైజర్లను పంపిణీ చేస్తున్నట్టు సాయికిరణ్‌వివరించారు. కరోనా మహమ్మారిని తరలిమి కొట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-03-29T21:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising