ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వోఎల్‌ఎక్స్‌లో ఘరానా మోసం

ABN, First Publish Date - 2020-08-03T10:50:21+05:30

వోఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు ద్విచక్రవాహనాలు అమ్ముతున్నట్టు ప్రకటన ఇచ్చి మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. బాధితుడి వివరాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌లో డబ్బులు - చెల్లించిన బాధితుడు


శంభునిపేట, ఆగస్టు 2 : వోఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు ద్విచక్రవాహనాలు అమ్ముతున్నట్టు ప్రకటన ఇచ్చి మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. బాధితుడి వివరాల ప్రకారం.. నగరంలోని రంగశాయిపేట నాగమయ్య గుడి వద్ద గల ఓ వ్యక్తి వోఎల్‌ఎక్స్‌లో ద్విచక్ర వాహనాల ప్రకటన చూసి జూలై 29న ఆర్డర్‌ చేశాడు. పల్సర్‌కు రూ.40వేలు, హోండా ఆక్టీవాకు రూ.36వేలు ధర నిర్ణయించారు. తాము ఇండియన్‌ ఆర్మీ వారిమని బాధితుడిని నమ్మేలా చేసి మొదటగా ట్రాన్స్‌పోర్ట్‌ చార్జి కింద రూ. 6200 పంపమన్నారు.


రెండు గూగుల్‌ పే నెంబర్లను పంపించారు. గూగుల్‌పేలో నేరగాళ్లు ఇండియన్‌ ఆర్మీ గూగుల్‌ పే అని నమోదు చేసుకోవటంతో బాధితుడి నమ్మి డబ్బులు పంపాడు. జూలై 30న బైక్‌  కాజీపేటకు వస్తున్నట్లు నమ్మించారు. తమ గూగుల్‌ పే ఖాతాలో మొత్తాన్ని వేయాల్సిందని చెప్పడంతో బాధితుడు తన అకౌంట్లోంచి సదరు నెంబర్‌లకు రూ.76వేలను పంపించాడు. కొద్ది సేపటికే సదరు ఫోన్‌ నెంబర్‌లు పని చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి స్థానిక మిల్స్‌కాలనీ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ క్రైమ్‌ సిబ్బందికి తెలిపి తనుకు జరిగిన మోసాన్ని వివరించాడు.

Updated Date - 2020-08-03T10:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising