ప్రజా సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వాలు
ABN, First Publish Date - 2020-10-03T11:06:56+05:30
దేశంలో రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రధాని మోదీ తక్షణమే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా ..
ప్రధాని మోదీ రాజీనామా చేయాలి
కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్
మహబూబాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : దేశంలో రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రధాని మోదీ తక్షణమే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకవచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. మూడు కొట్ల సెంటర్ నుంచి గాంధీపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెహ్రూ సెంటర్‌లో చేపట్టిన ఆందోళనలో బలరాంనాయక్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయని ఆరోపించారు. యూపీలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల వాహనాలను అడ్డుకుని రాహుల్‌గాంధీని నెట్టి కిందపడేయడం సిగ్గుచేటన్నారు.
యూపీ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూనావత్ రాధ, పోరిక సాయిశంకర్, సోమేశ్వర్‌రావు, హెచ్.వెంకటేశ్వర్లు, చుక్కల ఉదయ్‌చందర్, గుగులోతు వెంకట్, తిప్పర్తి శ్రీధర్, మాలోతు అరుణ్, రియాజ్ అన్సారీ, గుగులోతు వంశీ, తోట వెంకన్న, సందీప్, రమేష్, ఫరూక్ పాల్గొన్నారు. డోర్నకల్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, సోనకృపాకర్, గంట యాకేష్, కాసం శేఖర్, హరినాథ్‌రెడ్డి, కొండయ్య పాల్గొన్నారు. కేసముద్రంలో పీసీసీ సభ్యుడు గుగులోతు దస్రునాయక్, అంబటి మహేందర్‌రెడ్డి, బండారు దయాకర్, అల్లం నాగేశ్వర్‌రావు, మ హేందర్ ఆందోళన చేపట్టారు. గార్ల మండల కేంద్రంలో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ధనియాకుల రామారావు, వెంకట్రామయ్య, కృష్ణగౌడ్, ఎంపీటీసీలు రాజకుమారి, నాగమణి పాల్గొన్నారు. బయ్యారంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాగా టీపీసీసీ సభ్యుడు కిషన్‌నాయక్, మండల అధ్యక్షుడు ముసలయ్య, ప్రధాన కార్యదర్శి సీతారాములు, శ్రీనివాస్, గణేష్ పాల్గొన్నారు.
Updated Date - 2020-10-03T11:06:56+05:30 IST