ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి నాయిని కన్నుమూత

ABN, First Publish Date - 2020-10-22T08:17:06+05:30

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అపోలోలో చికిత్సపొందుతూ  తుదిశ్వాస విడిచిన నర్సింహారెడ్డి

సెప్టెంబరు 28న కరోనా ‘పాజిటివ్‌’

కోలుకున్న వెంటనే..  ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రం

ఈనెల 13న జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరిక

బుధవారం సాయంత్రానికి  ఆరోగ్యం విషమం

జఅర్ధరాత్రి 12.25 గంటలకు  తుదిశ్వాస విడిచిన నాయిని

 

రాంనగర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 28న కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో నాయిని చేరారు. కరోనా తగ్గిన తర్వాత మళ్లీ వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.


న్యుమోనియా తలెత్తడంతో సిటీ న్యూరో సెంటర్‌ నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా ఇక్కడి వైద్యులు గుండె ఆపరేషన్‌ చేసి స్టంట్‌ వేశారు. అయినా ఆరోగ్యం బాగుపడకపోవడంతో.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం విషమించిందని నాయిని అల్లుడు, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డి, వైద్యులు బుధవారం సాయంత్రం వెల్లడించారు.


ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. కాగా సీఎం కేసీఆర్‌ బుధవారం సాయంత్రం 6 గంటలకు అపోలో ఆస్పత్రికి చేరుకొని నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు. ఇక నాయిని సతీమణి అహల్యకు కూడా కరోనా సోకింది. అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.  

Updated Date - 2020-10-22T08:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising