ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక వైరస్‌ మానవ అస్ధిత్వానికి సవాల్‌చేస్తోంది

ABN, First Publish Date - 2020-08-15T21:52:30+05:30

ఇన్నేళ్ల స్వాతంద్య్ర దినోత్సవఫలాలుగా మనం అభివృద్ధిని, సంక్షేమాన్ని పొందామని, ఇప్పుడు మాత్రం ఒక వైరస్‌ మానవ అస్థిత్వానికే సవాల్‌ విసురుతోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర.శోభ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఇన్నేళ్ల స్వాతంద్య్ర దినోత్సవఫలాలుగా మనం అభివృద్ధిని, సంక్షేమాన్ని పొందామని, ఇప్పుడు మాత్రం ఒక వైరస్‌ మానవ అస్థిత్వానికే సవాల్‌ విసురుతోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర.శోభ అన్నారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి అరణ్యభవన్‌లో ఆమె స్వాతంత్య్ర దినోత్సవ డేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ అధికారులు, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ అడవులు, పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలన్నారు. అదే సమయంలో ఎవరి పరిధిలో వారు మిగితా వారిని చైతన్యం చేయాలన్నారు. 


రాజ్యాంగంలో కూడా అడవులు,పర్యావరణ రక్షణను పౌరుల విధుల్లో చేర్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. పరిసరాలు, పర్యావరణం చక్కగాకాపాడుకున్నపప్పుడే సాధించిన, అనుభవిస్తున్న స్వాతంత్ర్యానికి సార్ధకత ఉంటుందని తెలిపపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. జంగిల్‌బచావో,..జంగల్‌ బడావో...నినాదం కూడా తీసుకుందని అన్నారు. ఇదేస్పూర్తితో అటవీ అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. 

Updated Date - 2020-08-15T21:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising