ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ జంతువులను పెంచుకోవాలంటే నమోదు తప్పనిసరి

ABN, First Publish Date - 2020-11-26T23:59:05+05:30

కేంద్ర అటవీ శాఖ అదేశాల ప్రకారం డిసెంబర్ 2లోగా అన్ లైన్ లో నమోదు ప్రక్రియ దరఖాస్తు చేసుకున్నాక అయా జంతువులను పరిశీలించి అనుమతులు ఇవ్వనున్న అటవీశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర అటవీ శాఖ అదేశాల ప్రకారం డిసెంబర్ 2లోగా అన్ లైన్ లో నమోదు ప్రక్రియ దరఖాస్తు చేసుకున్నాక అయా జంతువులను పరిశీలించి అనుమతులు ఇవ్వనున్న అటవీశాఖ విదేశీ జంతువులు, పక్షులను పెంచుకునే వారు తప్పనిసరిగా అటవీ శాఖ ద్వారా అన్ లైన్ లో నమోదు చేసుకోవాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ స్పష్టం చేశారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇదివరకే నిబంధనలు విడుదల చేసిందని తెలిపారు. విదేశీ జంతువులు, పక్షులను (ఎగ్జోటిక్ యానిమల్స్) కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలు, రిసార్డులు తప్పని సరిగా డిసెంబర్ రెండవ తేదీలోగా అన్ లైన్ లో నమోదు చేసుకోవాలని అటవీ శాఖ తెలిపింది. 


విదేశీ జంతువులను దిగుమతి చేసుకోవటం, పెంచటం, క్రయ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో వాటి పర్యవేక్షణ కోసం కేంద్ర అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండులోగా నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి, అదే నెల 15లోగా అటవీ శాఖ అనుమతి పత్రాలను అందించనుంది. ఈ గడవులోగా అప్లికేషన్ పెట్టుకున్న వారు, ఆయా జంతువులకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లను ఇవ్వాల్సిన అవసరంలేదని, డిసెంబర్ 15 తర్వాత మాత్రం వాటికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని పీసీసీఎఫ్ తెలిపారు.


తెలంగాణ పరిధిలో విదేశీ జంతువులు, పక్షులు కలిగిఉన్న వ్యక్తులు, సంస్థలు, రిసార్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ లైన్ ద్వారా వివరాలు వెల్లడించాలని అటవీ శాఖ కోరింది.

Updated Date - 2020-11-26T23:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising