ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నీ మార్పిడి కోసం.. దాచుకుంటే దోచుకున్నారు..!

ABN, First Publish Date - 2020-07-27T19:26:18+05:30

అల్వాల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి మచ్చబొల్లారం రుక్మిణి ఎన్‌క్లేవ్‌లోని శివసాయి అపార్టుమెంట్‌లో ఈ నెల 4న భారీ చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో దొంగ?    

57 లక్షల నగదు, 30 తులాల బంగారం అపహరణ


అల్వాల్: అల్వాల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి మచ్చబొల్లారం రుక్మిణి ఎన్‌క్లేవ్‌లోని శివసాయి అపార్టుమెంట్‌లో ఈ నెల 4న భారీ చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రూ.57 లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రాంచందర్‌ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీ మార్పిడి కోసం తన ప్లాట్‌ అమ్మి, వచ్చిన రూ. 57 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఇంట్లో దాచిపెట్టాడు. ఈనెల 2న మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి మెదక్‌ జిల్లాలోని సొంత గ్రామానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంటి ప్రధాన ద్వారం విరిగి ఉండటంతోపాటు బీరువాలోని కప్‌బోర్డులో ఉంచిన నగదు, బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే అల్వాల్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఏసీపీ నరసింహారావు, సీఐ యాదగిరి క్లూస్‌ టీమ్‌తో వెళ్లి ఆధారాలను సేకరించారు. పాత నేరస్థుడైన ఒకరు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Updated Date - 2020-07-27T19:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising