ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆర్‌ఎస్‌’ జన్మదినం సందర్భంగా ఫుట్‌బాల్‌ పోటీలు

ABN, First Publish Date - 2020-11-24T10:22:42+05:30

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ 54వ జన్మదినం సందర్భంగా ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. జనగామ సాన్‌మారియా హైస్కూల్‌లో జరిగిన టోర్నమెంటులో ఆరు జిల్లాల నుంచి 11 జట్లు పాల్గొన్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ కల్చరల్‌, నవంబరు 23: తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ 54వ జన్మదినం సందర్భంగా ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. జనగామ సాన్‌మారియా హైస్కూల్‌లో జరిగిన టోర్నమెంటులో ఆరు జిల్లాల నుంచి 11 జట్లు పాల్గొన్నాయి. మొదటి స్థానాన్ని హైదరాబాద్‌ జీఆర్‌ఎఫ్‌ఏ, రెండో స్థానాన్ని హైదరాబాద్‌ యూఎఫ్‌ఎస్‌సీ, మూడో స్థానాన్ని వరంగల్‌ జేఎన్‌ఎస్‌ జట్లు కైవసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌పీ బర్త్‌డే కేక్‌ కట్‌ చేసిన అనంతరం విజేతలకు ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ డి.మల్లేశ్‌ బహుమతులు, మెడల్స్‌ అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ రాజమౌళి, దేసు రాథోడ్‌, ఎండి.అబ్బాస్‌, బొట్ల మురళి, మోర్తాల ప్రభాకర్‌, శాడ పోచయ్య, ఇస్లావత్‌ సుధాకర్‌, కాసాని ఉపేందర్‌, మంద రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


స్టేషన్‌ఘన్‌పూర్‌లో రక్తదాన శిబిరం..

స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌ సంక్షేమ గురుకులంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సీఐ శ్రీనివా్‌సరెడ్డి  శిబిరాన్ని ప్రారంభించి తాను రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించుకుని చైతన్యవంతులు కావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, లయన్స్‌ క్లబ్‌ బాధ్యులు దస్తగిరి, ఓంప్రకాష్‌, కరుణాకర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ సమ్మయ్య, జయంధర్‌, రెడ్‌క్రాస్‌ వైద్య సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సీఐ శ్రీనివాసరెడ్డికి ప్రశంసాపత్రం అందించారు.

Updated Date - 2020-11-24T10:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising