ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా, గోదావరి బేసిన్లకు వరద

ABN, First Publish Date - 2020-07-07T07:10:25+05:30

కృష్ణా, గోదావరి బేసిన్లకు వరద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో మళ్లీ వరద ప్రారంభమైంది. ఆల్మట్టిలోకి సోమవారం సుమారు 30 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఎగువ ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వచ్చే రెండు రోజు ల్లో ఈ వరద పెరిగే అవకాశం ఉంది. మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు సోమవారం 4074 క్యూసెక్కుల వరద వచ్చింది. అలాగే తుంగభద్రకు 1267 క్యూసెక్కులు, శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 2,289 క్యూసెక్కుల వరద వస్తున్నది. 


గోదావరి బేసిన్‌లో వరద

గోదావరి బేసిన్‌లోనూ వరద ప్రవాహం నమోదవుతున్నది. శ్రీరాంసాగర్‌లోకి సోమవారం 5,621 క్యూసెక్కుల వరద వచ్చింది. అలాగే కడెం ప్రాజెక్టుకు స్వల్పంగా 948 క్యూసెక్కుల వరద వస్తున్నది. మేడిగడ్డ బ్యారేజి వద్ద సోమవారం సుమారు 20 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదయింది. వరద నీటి ఉధృతితో చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ఛత్తీ్‌సగఢ్‌ పరిధిలో భద్రాద్రి జిల్లా సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వదరనీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రాజెక్టు 25గేట్లలో 7గేట్లు అడుగు మేర ఎత్తి 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

Updated Date - 2020-07-07T07:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising