ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారులో మంటలు.. 10 నిమిషాల్లో బూడిద

ABN, First Publish Date - 2020-02-21T19:15:28+05:30

ఓ కుటుంబం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. కుటుంబంతో కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: ఓ కుటుంబం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. కుటుంబంతో కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కుటుంబ యజమాని గమనించి కుటుంబ సభ్యులను కిందకు దించేశాడు. కిందకు దిగిన కొన్ని నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నేరడిగొండ మండలం రోల్‌మామడ టోల్‌గేట్ దగ్గర చోటుచేసుకుంది. క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


వివరాల్లోకి వెళ్తే..

ఆనంద్, తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తున్నారు. హఠాత్తుగా కారులో పొగలు రావడం గమనించి ఆనంద్.. తన కుటుంబ సభ్యులను కిందకు దించేశాడు. అనంతరం 100కు డయల్ చేసి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే 10 నిమిషాల్లో కారు దగ్ధమైంది. ప్రమాదస్థలిని పోలీసులు పరిశీలించి కారును రోడ్డు పక్కకు తొలగించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నారు. అందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారు ప్రమాదానికి గురుకావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. 





Updated Date - 2020-02-21T19:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising